వై.ఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు రేష‌న్ కార్డులు

ఏపీలో వై.ఎస్ జ‌గన్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు అండ‌గా ఉండేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు రైస్‌ కార్డులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ బాధ్య‌త‌ల‌ను వాలంటీర్ల‌కు అప్పగించింది.

రాష్ట్రంలోని ప్ర‌తి జిల్లాలో ట్రాన్స్‌జెండ‌ర్లు ఉన్నారు. వీరంతా ఎలాంటి ఆద‌ర‌ణ‌కు నోచుకోక నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వీరి ఇబ్బందుల‌ను గుర్తించిన ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వం రైస్‌ కార్డులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డంతో ట్రాన్స్‌జెండ‌ర్లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఎలాంటి గుర్తింపు లేకుండా ఉన్న త‌మ‌కు వై.ఎస్ జ‌గ‌న్ ప్రభుత్వం రైస్‌ కార్డు ఇవ్వ‌డం సంతోషంగా ఉందన్నారు.

ప్ర‌భుత్తం ఏమ‌నిందంటే ట్రాన్స్‌జెండ‌ర్లు, అనాథ‌లు, పిల్ల‌లు లేని వితంతువులు, ఇల్లులేని వారిని గుర్తించాల‌ని వాలంటీర్ల‌కు తెలిపింది. వీరంతా గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ప‌ది రోజుల్లోనే రైస్ కార్డులు మంజూరు చేయాల‌ని తెలిపింది. ప్ర‌భుత్వ నిర్ణయంతో వీరంతా సంతోషంలో ముగినితేలుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here