ఓటీటీలో కాదు థియేటర్లలోనే.. 

రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డసినిమా షూటింగ్ ను చిత్ర యూనిట్ త్వరలోనే తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూత పడడంతో విరాట పర్వం చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఈ వార్తలను సినిమా యూనిట్ ఖండించినట్లు తెలుస్తోంది. విరాట పర్వం చిత్రాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ  సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది. 1980 బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా వ‌స్తోన్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి కామ్రేడ్ భార‌త‌క్క పాత్రలో  క‌నిపించ‌నుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here