రికార్డు సృష్టించిన కొహ్లీ, రోహిత్, ధోనీ

దాదాపు ఆరు నెల‌ల కాలం నుంచి క్రికెట్ కు దూర‌మున్నా అభిమానులు క్రికెట‌ర్ల‌ను ఏమాత్రం మ‌ర్చిపోలేద‌ని తెలుస్తోంది. ఐపిఎల్ ఆరంభానికి ముందే క్రికెట‌ర్లు రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే ఇది గ్రౌండ్లో కాదు.. నెట్టింట్లో..

అవును టీం ఇండియా గురించి నెటిజ‌న్లు తెగ వెతికేశార‌ని ఓ నివేదిక వెల్ల‌డించింది. సెమ్‌ర‌ష్ సంస్థ అధ్య‌య‌నం ప్ర‌కారం టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ వివ‌రాల కోసం క్రికెట్ ప్రియులు ఆరా తీశారు.  ఈ సంవ‌త్స‌రం జ‌వ‌న‌రి నుంచి జూన్ వ‌ర‌కు స‌గ‌టున 16.2 ల‌క్ష‌ల సార్లు ఇంట‌ర్నెట్‌లో వెతికారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ప్రాచుర్యం పొందిన క్రికెట‌ర్‌గా కొహ్లీ రికార్డు సాధించార‌ని సంస్థ నివేదిక వెల్ల‌డించింది.

కొహ్లీ త‌ర్వాత రోహిత్ శ‌ర్మ కోసం 9.7 ల‌క్ష‌ల సార్లు వెతికారు. ఆ త‌ర్వాత మ‌హేంద్ర సింగ్ ధోని కోసం 9.4 ల‌క్ష‌ల సార్లు ఆరా తీశారు. ఇలా వెతికిన మొద‌టి ప‌ది మంది ఆట‌గాళ్ల‌లో ఆరుగురు ఇండియ‌న్లే ఉన్నారు. ఇక ఆట‌గాళ్ల గురించే కాకుండా టీం ఇండియా గురించి నెల‌కు 2.4 ల‌క్ష‌ల సార్లు ఆన్‌లైన్‌లో వెతికారు. ఆ త‌ర్వాత ఇంగ్లండ్ 66వేలు, ఆస్ట్రేలియా 33వేలు, వెస్టిండీస్ 29వేలు, పాకిస్థాన్ 23వేలుగా ఉంది. ఇక మహిళా క్రికెట్ జ‌ట్టు నుంచి స్మృతి మందాన 12వ స్థానం ద‌క్కించుకున్నారు,

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here