చైనా అదే చేస్తోంది..

భార‌త్‌తో శాంతి కోరుకుంటున్న‌ట్లు చెబుతున్న చైనా చేత‌ల్లో మాత్రం దీనికి విభిన్నంగా చేస్తోంది. ఓ వైపు ఇండియాతో చ‌ర్చ‌లు జ‌రుపుతూనే మ‌రో వైపు త‌న వ‌క్ర‌బుద్దిని చాటుకుంటూ స‌రిహద్దుల్లో బ‌ల‌గాలు రెట్టింపు చేస్తోంది.

తాజాగా ఫోర్బ్స్ ప‌త్రిక స‌రిహద్దులో చైనా ఏం చేస్తోందో వివ‌రించింది. ఇందులో చైనా భార‌త స‌రిహ‌ద్దుల్లోకి భారీగా ఆయుధాలు త‌లిస్తున్న‌ట్లు పేర్కొంది. భార‌త్ చైనాల మ‌ధ్య నిన్న కూడా చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ చ‌ర్చ‌ల్లో చైనా విదేశాంగ ప్ర‌తినిధి ఝావో లిజియాన్ మాట్లాడుతూ ఇండియాతో స్నేహ పూర్వ‌క సంబంధాల కోసం కృషి చేస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు.

ఒక‌వైపు అక్క‌డ చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గానే మ‌రో వైపు చైనా స‌రిహద్ధులో యుద్ధ విమానాలు త‌ర‌లించింది. జులై 28న షింగ్ యాంగ్ ప్రావిన్స్‌లోని హోట‌న్ ఎయిర్ బేస్‌లో 36 యుద్ధ విమానాలు, హెలికాఫ్ట‌ర్‌లు ఉండ‌గా ఇప్పుడు వీటి సంఖ్య రెట్టింపు అయ్యింది. ఈ విష‌యాన్ని అమెరికా ర‌క్ష‌ణ రంగ నిపుణులు గుర్తించారు. అయితే చైనా త‌ర‌లిస్తున్న ప్రాంతం ల‌ద్దాఖ్‌కు ద‌గ్గ‌ర‌లో ఉంది.

మ‌రోవైపు చైనా ఎన్ని కుయుక్తులు ప‌న్నినా ప‌రిస్థితులు ఆ దేశానికి అనుకూలంగా ఉండ‌వ‌ని తెలుస్తోంది. ఎందుకంటే హిమాల‌య ప‌ర్వతాలు చైనాకు అన్ని విధాలా అడ్డంకిగా ఉంటాయి. ఇక భార‌త వాయుసేన‌కు అన్ని విధాలా ఆధిప‌త్యం ప్ర‌దర్శించే నైపుణ్యం ఉంది. ఇత‌ర దేశాలతో క‌లిసి భార‌త్ ఎన్నో కొత్త విష‌యాలు నేర్చుకుంది. ఇక చైనా వ‌క్ర బుద్దిని భార‌త్ ముందే గ‌మ‌నించాల‌ని మేధావులు చెబుతున్నారు. గ‌త అనుభ‌వాలు దృష్టిలో ఉంచుకొని చైనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ముందుకు వెళ్లాల‌ని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here