కేజీఎఫ్ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ మూవీ…?

కేజీఎఫ్ మూవీతో సూప‌ర్‌హిట్ ద‌ర్శ‌కుడిగా పేరుతెచ్చుకున్నారు ప్ర‌శాంత్ నీల్. ఇప్పుడు ఈ క్రేజీ డైరెక్ట‌ర్ యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్‌తో మూవీకి సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు షికారు చేస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పూర్త‌వ్వ‌డానికి ఇంకా చాలా టైం ప‌డుతుంది. ప్ర‌శాంత్ నీల్ కూడా ప్ర‌స్తుతం కేజీఎప్ 2 మూవీ ప‌నిలో బిజీగా ఉన్నారు. అయితే ప్ర‌శాంత్, ఎన్టీఆర్‌తో మూవీ చేయ‌నున్నార‌ని గాసిప్స్ వ‌స్తున్నాయి. అయితే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌పై చాలా రోజుల నుంచి వార్త‌లొస్తున్నాయి.

కాగా ఈ మ‌ధ్యే ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ క‌థ‌ను విన్నార‌ని టాక్ న‌డుస్తోంది. అయితే ఇది జ‌స్ట్ శాంపిల్ మాత్ర‌మే. ఇంకోసారి వీరిద్ద‌రూ క‌లిసి ఈ సినిమా గురించి డిస్క‌ష‌న్ చేస్తార‌ని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే అన్నీ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ పూర్తి అయిన త‌ర్వాత‌నే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. 2022 తర్వాత ఈ సినిమా ప్రారంభం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం ఇంత‌వ‌ర‌కు రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here