క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే రూ. 10 ల‌క్ష‌ల జ‌రిమానా..

ప్ర‌పంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా వెంటాడుతూనే ఉంది. దీంతో వ్యాక్సిన్ క‌నుగొనేందుకు దేశాలు కుస్తీ ప‌డుతున్నాయి. అయినా రోజురోజుకీ కేసులు పెరుగుతుండ‌టంతో కొన్ని దేశాలు నిబంధ‌న‌లు కఠిన‌త‌రం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బ్రిట‌న్ ల‌క్ష‌ల్లో ఫైన్లు వేస్తోంది.

క‌రోనా నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేసేందుకు బ్రిట‌న్ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఇందులో భాగంగా నిబంధ‌న‌లు ఎవ‌రైనా అతిక్ర‌మిస్తే ప‌ది వేల పౌండ్లు అంటే ఇండియ‌న్స్ క‌రెన్సీలో ప‌ది ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌రిమానా విధించ‌నున్నారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం రూల్స్ ప్ర‌క‌టించేసింది. వెయ్యి పౌండ్ల నుంచి ప‌దివేల పౌండ్ల వ‌ర‌కు జ‌రిమ‌నా వేస్తామ‌ని హెచ్చ‌రించింది ప్ర‌భుత్వం.

కరోనా పాజిటివ్ వ‌చ్చిన వారు కచ్చితంగా 14 రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని సూచ‌న‌లు జారీ చేసింది. వీరితో పాటు ల‌క్ష‌ణాలు ఉన్న వారు కూడా ఐసోలేష‌న్లో ఉండాల‌ని పేర్కొంది. ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త రూల్స్ వ‌ర్తిస్తాయ‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా విజృంభిస్తుండ‌టంతో ప్ర‌జ‌లంతా త‌ప్ప‌నిస‌రిగా నిబంధ‌న‌లు పాటించాలని దేశ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ వెల్ల‌డించారు. వైర‌స్ త‌గ్గినా మ‌ళ్లీ ఇప్పుడు విజృంభిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. వివిధ కుటుంబాల‌కు చెందిన వ్య‌క్తులు ఆరుగురి కంటే ఎక్కువ మంది ఎక్కువ చోట ఉండ‌కూడ‌ద‌ని నిబంధ‌న‌ల్లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here