జాతీయ స్థాయిలో ఏపీ రాజ‌కీయాలు.. భ‌విష్య‌త్తులో ఇంకేమ‌వుతుందో.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఎప్పుడూ సంచ‌లంగానే ఉంటాయి. అయితే రాజ‌కీయాలు అంటేనే సంచ‌ల‌న‌మే కానీ ఏపీ రాజ‌కీయాలు డిఫ‌రెంట్‌. చంద్ర‌బాబు అధికారంలో ఉన్నా, వైఎస్సార్ ప్ర‌భుత్వం వ‌చ్చినా  ఆ త‌ర్వ‌త రాష్ట్ర విభ‌జ‌న‌, ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాలు అన్నీ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగానే ఉంటాయి.

ఎప్ప‌టిలాగే ఇప్పుడు ఏపీ రాజ‌కీయాలు దేశ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌ణలు సృష్టిస్తున్నాయి. ఇందుకు కార‌ణం ఇటీవ‌ల చోటుచేసుకున్న ప‌రిణామాలే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఎంపిక చేసిన స‌మ‌యంలో జ‌రిగిన వేల ఎక‌రాల భూ కుంభ‌కోణంపై ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తోంది. కుంభ‌కోణంలో దాగి ఉన్న బ‌డా నేత‌లు, పెద్ద పెద్ద వ్య‌క్తుల‌ను బ‌య‌ట‌కు తీసేందుకు విచార‌ణ చేప‌ట్టింది. అయితే హైకోర్టు మాత్రం ఈ కేసులో విచార‌ణ‌ను ఆపాల‌ని, ఎఫ్‌.ఐ.ఆర్ రిపోర్టును కూడా బ‌హిరంగం చేయ‌వ‌ద్ద‌ని పేర్కొంది.

ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప‌రిస్థితి రాలేద‌ని మేధావులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నో కేసుల్లో ఎఫ్‌.ఐ.ఆర్ పై వార్త‌లు రాసేందుకు, ప్ర‌చురించేందుకు అవ‌రోధాలు లేవ‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. అయితే ఏపీలో ప‌రిస్థితి డిఫ‌రెంట్‌. హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌పై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఇది ఎంత‌వ‌ర‌కు క‌రెక్టు అన్న దానిపైనే ఇప్పుడు అంద‌రి దృష్టీ నెల‌కొంది. మేధావులు, జాతీయ స్థాయి జ‌ర్న‌లిస్టులు సైతం దీనిపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే కేవ‌లం కొంద‌రు ప్ర‌ముఖులు ఈ కుంభ‌కోణంలో ఉన్నార‌న్న కార‌ణంతోనే న్యాయ‌స్థానం ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తోందా అని వైసీపీ నేత‌లు అంటున్నారు. ఈ విష‌యంపై పార్లమెంటులో కూడా ప్ర‌స్తావించారు. విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ల‌డంతో పాటు జాతీయ స్థాయిలో అంద‌రికీ తెలియాల‌న్న‌ది వైసీపీ ఆలోచ‌నగా క‌న‌బ‌డుతోంది. అందుకే దీనిపై ఏపీ అధికార పార్టీ సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే ఎఫ్‌.ఐ.ఆర్ పై కూడా ఆంక్ష‌లు విధించ‌డం చూస్తే భ‌విష్య‌త్తులో ఇంకే విధంగా చ‌ర్య‌లు ఉంటాయోనన్న ఆందోళ‌నను మేధావులు వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here