జ‌గ‌న్ మ‌ద్ద‌తిస్తే.. కేసీఆర్ వ్య‌తిరేకించారు..

కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారం చేప‌ట్టిన న‌రేంద్ర మోదీ అధికారం చేపట్టిన‌ప్ప‌టి నుంచి చారిత్రాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తాజాగా వ్య‌వ‌సాయ బిల్లులు ఆమోదం పొందేందుకు రాజ్య‌స‌భ‌లో ఎంత గంద‌రగోళం నెల‌కొన్నా మోదీ బిల్లును ఆమోదింప‌జేసుకున్నారు. ఈ బిల్లుల‌కు ఏపీ మ‌ద్ద‌తు ఇచ్చినా.. తెలంగాణ వ్యతిరేకించింది.

వ్య‌వ‌సాయ రంగంలో సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తే తీసుకొచ్చిన బిల్లులు రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొందాయి. ఈ బిల్లుల‌ను అడ్డుకునేందుకు విప‌క్షాలు ఎన్ని ప్ర‌యత్నాలు చేసినా ఫ‌లించ‌లేదు. మూజువాణీ ఓటుతో బిల్లుల‌ను కేంద్రం ఆమోదించుకుంది. ఈ బిల్లుల‌కు కాంగ్రెస్‌తో పాటు టిఆర్ఎస్‌, శిరోమ‌ణీ అకాలీద‌ళ్ స‌హా 14 పార్టీలు వ్య‌తిరేకించాయి. అయినా కేంద్రం మిగ‌తా పార్టీల మ‌ద్ద‌తుతో వ్య‌వ‌సాయ బిల్ల‌ల‌ను ఆమోదింప‌జేసుకుంది.

బిల్లుల‌ను అడ్డుకునేందుకు విప‌క్షాలు సర్వ‌శ‌క్తులు ఒడ్డాయి. విప‌క్ష స‌భ్యులు బిల్లుల పేప‌ర్ల‌ను డిప్యూటీ చైర్మ‌న్ మీద చింపివేశారు. అనంత‌రం ఆయ‌న మైకు లాక్కునేందుకు ప్ర‌య‌త్నించగా.. రాజ్య‌స‌భ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. 14 రాజ‌కీయ పార్టీలు ఈ బిల్లుల‌ను వ్య‌తిరేకించినా వైసీపీ మాత్రం స‌పోర్టు చేసింది. వైసీపీ ఎంపీలు వ్య‌వ‌సాయ బిల్లుల‌కు అనుకూలంగా ఓటు వేశారు. మోదీ అనుకుంటే ఏదైనా సాధిస్తార‌న్న విష‌యం ఈ బిల్లుల ఆమోదంతో మ‌రోసారి నిరూపిత‌మైంద‌ని మేధావులు అంటున్నారు. క‌రోనా కార‌ణంగా ప‌లువురు ఎంపీలు పార్ల‌మెంటుకు హాజ‌ర‌వ్వ‌క‌పోయినా మోదీ చాక‌చ‌క్యంగా బిల్లుల‌ను పాస్ చేసుకున్నారంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here