తిరుమ‌ల వెళితే జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ ఇవ్వాలి.. ఎంపీ ర‌ఘురామ‌.

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తిరుమ‌ల వెళ్లిన‌పుడు కచ్చితంగా డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు అన్నారు. ఈయ‌న వైసీపీ నుంచి గెలిచినా ఇటీవ‌ల ఆ పార్టీకి వ్య‌తిరేకంగా ఉంటూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఏపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేస్తూ ఇటీవ‌ల వార్త‌ల్లోకెక్కారు ఈ ఎంపీ. తాజాగా తిరుమ‌ల అంశంపై కూడా మాట్లాడుతున్నారు.

తిరుమ‌ల‌లో వీవీఐపీల‌కు మాత్ర‌మే డిక్ల‌రేష‌న్ ఉంద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోను ర‌ద్దు చేయ‌కుండా నిర్ణ‌యం తీసుకోవ‌డం సాధ్యం కాద‌న్నారు. జ‌గ‌న్ తిరుమ‌ల వెళ్తే డిక్ల‌రేష్ ఇవ్వాల‌ని తాను కోరుతున్న‌ట్లు చెప్పారు. చిన్న సంత‌కం విష‌యంలో ఎందుకంత ర‌చ్చ చేస్తున్నార‌న్నారు. ఇక ఏపీలో హిందూ ఆల‌యాల మీద దాడులు ఎక్కువ‌య్యాయ‌న్నారు. దేవాల‌యాల‌పై దాడుల‌కు నిర‌స‌న‌గా న‌ల్ల బ్యాడ్జీ క‌ట్టుకొని పార్ల‌మెంటు స‌మావేశాల‌కు వెళ‌తాన‌ని ర‌ఘురామ చెప్పారు.

ఇక ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయించ‌డం సాధ్యం కాద‌ని ఎంపీ అన్నారు. అయితే మ‌రో రెండు రోజుల్లో త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌జ‌లు త‌న‌ను బ‌హిష్క‌రించ‌డం లేద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు తాను వార‌ధిలా ఉన్న‌ట్లు ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. మ‌రి ఈ ఎంపీని బ‌హిష్క‌రిస్తారన్న విష‌యంలో క్లారిటీ లేదు. ఇటీవ‌ల ఈయ‌న గెలిచిన వైసీపీ పార్టీకి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న విష‌యం తెలిసిందే. అయితే కేవ‌లం ఇత‌ర పార్టీల‌కు మేలు చేసేందుకే ఈయ‌న ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here