ఆగ‌ష్టు 11 త‌ర్వాత సెప్టెంబ‌ర్ 23..

క‌రోనా మ‌హ‌మ్మారిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ముందు నుంచీ చాక‌చ‌క్యంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ఆయ‌న స‌మాలోచ‌న‌లు జ‌రుపుతూ కోవిడ్‌ను క‌ట్ట‌డి చేసేందుకు కృషి చేస్తూనే ఉన్నారు. యావ‌త్ భార‌తాన్ని ఆయ‌న మాట‌ల‌తో ధైర్యాన్ని నింపే ప్ర‌య‌త్నంలో మోదీ విజ‌యం సాధించార‌నే చెప్పాలి.

ఈ నేప‌థ్యంలో ఆగ‌ష్టు 11వ తేదీన మోదీ దేశంలోని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమబెంగాల్‌, మ‌హారాష్ట్ర, పంజాబ్, బీహార్‌, గుజ‌రాత్‌, యూపీ ముఖ్య‌మంత్రుల‌తో పీఎం మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. ఆగ‌ష్టులో ఈ రాష్ట్రాల‌లో క‌రోనా కేసుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండేది. ఇప్పుడు మ‌రోసారి క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న ఏడు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్సుకు సిద్ధ‌మ‌య్యారు.

‌మ‌హారాష్ట్ర, ఆంధ్రప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడుల‌లో దేశంలో న‌మోదైన కేసుల్లో దాదాపు 60 శాతం కేసులు ఈ రాష్ట్రాల‌లోనే ఉన్నాయి. దీంతో ఈ నెల (సెప్టెంబ‌ర్‌) 23వ తేదీన దేశంలోని క‌రోనా పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా ఏడు రాష్ట్రాల‌తో మోదీ మ‌రోసారి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశం అవ్వున‌న్నారు. ప్ర‌ధానంగా క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు, ఏ విధంగా టెస్టింగ్ ట్రేసింగ్ జ‌రుగుతోంద‌ని అడ‌గ‌నున్నారు. వైద్య స‌దుపాయాలపై వివ‌రాలు సేక‌రించ‌నున్నారు. క‌రోనా కట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై మోదీ దిశా నిర్దేశం చేయ‌నున్నారు. కాగా దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్నా రిక‌వ‌రీ రేటు పెరిగింది. ప్ర‌పంచంలో భార‌త్‌లోనే ఎక్కువ‌గా రిక‌వ‌రీ రేటు ఉండ‌టం ఒకింత సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌నే చెప్పాలి. ఈ ప‌రిస్థితుల్లో క‌రోనా క‌ట్ట‌డి కోసం మ‌రింత కృషి చేయాల‌ని ఆయ‌న చెప్పే అవ‌కాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here