చంద్ర‌బాబుపై మండిప‌డ్డ విజ‌య‌సాయిరెడ్డి..

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ సంస్థాగ‌త ప‌ద‌వులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీనిపై విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

ఏపీలో తెలుగుదేశం పార్టీ ప‌ద‌వుల‌ను బాబు ప్ర‌క‌టించారు. ఏపీ అధ్య‌క్షుడిగా అచ్చెన్నాయుడును కూడా ప్ర‌క‌టించారు. ఇక దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. వై.ఎస్ జ‌గ‌న్ రాష్ట్రంలో బీసీ కార్పోరేష‌న్లు ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత వెనువెంట‌నే చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు ప‌దవులు ఇస్తూ ప్ర‌క‌టించారు. దీనిపై విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

విజ‌య‌సాయిరెడ్డి ఏమ‌ని ట్వీట్ చేశారంటే.. అధిరారంతో విర్రవీగిన రోజుల్లో ‘అంతు చూస్తా, తోక కోస్తా’ అని బీసీలను బాబు ఈసడించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు బాబు గారూ. విస్తరిలో వడ్డించేప్పుడే ఆకలి మంటను గుర్తించాలి. వాటిని ఎత్తేసేటప్పుడు కాదు అని ఆయ‌న ట్వీట్ చేశారు. మ‌రి దీనిపై టిడిపి ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్ర‌ధానంగా ఏపీ కొత్త అధ్యక్షుడిగా నియ‌మితులైన అచ్చెన్నాయుడు ఏమంటారో అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here