చంద్రబాబు ఎందుకిలా చేశారో అంద‌రికీ తెలుసు..

తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి, తెలుగుదేశం శాసనసభాపక్షం ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా ఎల్‌.రమణను కొనసాగించారు. పార్టీలో కీలకమైన సంస్థాగత పదవులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం ప్రకటించారు. అయితే ఈ ప‌ద‌వుల జాబితా ముందునుంచీ ఊహించిందే. కాగా ఈ విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు ప‌క‌డ్బంధీగా వ్య‌వ‌హ‌రించార‌ని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ బీసీల‌కు ప్రాధాన్యం ఇస్తుంద‌ని ఎప్ప‌టినో చెబుతున్న మాట‌. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారం చేప‌ట్టిన అనంత‌రం రాష్ట్రం మొత్తం జ‌గ‌న్‌ను ఏప‌ప‌క్షంగా గెలిపించార‌న్న టాక్ వినిపిస్తోంది. ఎన్న‌డూ లేనంత మెజార్టీ స్థానాల్లో వైసీపీ విజ‌యం సాధించింది. అంటే ప్ర‌జ‌లు వై.ఎస్ జ‌గ‌న్ వైపు ఉన్నార‌ని ఇట్టే అర్థ‌మ‌వుతోంది. దీనికి తోడు ఇటీవ‌లె వైసీపీ అదినేత జ‌గ‌న్ బీసీ కార్పోరేష‌న్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై నేత‌లు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌న్నింటినీన దృష్టిలో పెట్టుకున్న చంద్ర‌బాబు నాయుడు బీసీలు త‌మ‌వైపు ఉండేలా చూసుకునేందుకు ప్ర‌ణాళికా బ‌ద్దంగా ముందుకు వెళుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఇందులో భాగంగానే బీసీల‌కు తాము ఎప్పుడు అండ‌గా ఉంటామ‌ని ఇప్పుడు ప‌ద‌వుల్లో కూడా బీసీల‌కు ప్రాధాన్యం ఇచ్చామ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశార‌ని అంటున్నారు. పార్టీ 60 శాతం ప‌ద‌వులు బీసీల‌కే ఇచ్చామ‌ని చెబుతున్నారు. కానీ ఇదే స‌మ‌యంలో ప‌లు అనుమానాలు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు బీసీల‌కు ఏం చేశారో తెలుసుకోవాల‌ని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు టిడిపికి సూచిస్తున్నారు. అధికారంలో ఉన్న స‌మ‌యంలో బీసీల‌ను విడిచిపెట్టి.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు బీసీల‌కు తామే దిక్కు అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ఎవ‌రెన్ని చెప్పినా రాష్ట్రంలో ప్ర‌జ‌లు వ‌న్ సైడ్ ఉన్నార‌ని వైసీపీ భావిస్తోంది. మ‌రి చంద్ర‌బాబు నాయుడు ఇక ముందు ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేసి ప్ర‌జ‌ల్లోకి వెళ్లి మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here