ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థులు ఎంత ఖ‌ర్చు చేయాలో తెలుసా..

దేశంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణకు ఎంత ఖ‌ర్చు చేయాలో కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఎంపీ అభ్య‌ర్థి, ఎమ్మెల్యే అభ్య‌ర్థులు ఏ మేర ఖ‌ర్చు చేయాల‌న్న దానిపై స‌వ‌ర‌ణ‌లు చేసి వివ‌రాలు ప్ర‌క‌టించింది. లోక్‌స‌భ‌కు రూ. 77 ల‌క్ష‌లు, అసెంబ్లీకి 30.80 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల‌ని కేంద్రం తెలిపింది.

దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో ఎంత ఖ‌ర్చు చేయాల‌న్న దానిపై నిబంధ‌న‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం స‌వరించింది. గ‌తంలో లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు రూ. 70 ల‌క్ష‌లు, రూ. 54 ల‌క్ష‌లు ఉండేవి, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రూ. 28 ల‌క్ష‌లు, 20 ల‌క్ష‌ల మేర ఖ‌ర్చు చేయాల్సి ఉండేవి. అయితే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ నిబంధ‌న‌లు 1961 స‌వ‌రించి కొత్తగా ఖ‌ర్చు చేయాల్సిన దానిపై రూల్స్ రెడీ చేశారు. ఈ కొత్త వ్య‌యానికి సంబందించిన నిబంధ‌న‌లు ఇప్ప‌టి నుంచే అమ‌లులోకి రానున్నాయి.

కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, గోవా, సిక్కింతో పాటు 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు  లోక్‌స‌భ‌కు రూ. 59.40 ల‌క్ష‌లు, అసెంబ్లీ స్థానాల‌కు రూ. 22 లక్ష‌లుగా నిర్ణ‌యించింది. ఢిల్లీలో ఎంపీ ఎన్నిక‌ల‌కు రూ. 77 ల‌క్ష‌లు, అసెంబ్లీకి రూ. 30.80 ల‌క్ష‌లుగా, ఇక జ‌మ్ముక‌శ్మీర్‌లో లోక్‌స‌భ‌కు రూ. 70 ల‌క్ష‌లు, అసెంబ్లీకి రూ. 30.80 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించింది. ఈ మేర‌కు కేంద్ర న్యాయ‌శాఖ ఉత్త‌ర్వులు ఇచ్చింది.  మామూలుగా ఎన్నిక‌లు వ‌స్తే అభ్య‌ర్థులు భారీ మొత్తంలో ఖ‌ర్చు పెడుతుంటార‌ని మ‌న‌కు తెలుసు. అయితే అబ్య‌ర్థి ఎంత ఖ‌ర్చు పెట్టినా ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన మొత్తంలోపే ఖ‌ర్చు చేయాలి. అభ్య‌ర్థి చేసే ప్ర‌తి రూపాయికి విలువ క‌ట్టాల్సి ఉంటుంది. కాగా చాలా వ‌ర‌కు అభ్య‌ర్థులు ప్ర‌భు్త్వం నిర్ణ‌యించిన నిబంధ‌న‌లు దాటి ఎవ్వ‌రూ ఖ‌ర్చు చేయ‌లేదు. దీనిలో స‌గం వ్య‌యం మాత్ర‌మే ఖ‌ర్చు చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here