ఇంట్లో ఫైట్ చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

యువ హీరో అర్జున్ రెడ్డి అదే మ‌న విజ‌య్ దేవ‌ర కొండ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాల‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు విజ‌య్‌. ఇప్పుడు మ‌రో రికార్డు కూడా ఆయ‌న సొంతం చేసుకున్నారు.

విజ‌య్‌దేవ‌ర కొండ అగ్ర‌హీరోల స‌ర‌స‌న చేరిపోయారు. ఇండియాలో టాప్ 50 మోస్ట్ డిజైర‌బుల్ మెన్ జాబితాలో ఆయ‌న మూడో స్థానం ద‌క్కించుకొని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. షాహిద్ క‌పూర్‌, ర‌ణ్ వీర్ సింగ్ త‌ర్వాత విజ‌య్ నిలిచారు. దేశంలోనే ఎంతోమంది అగ్ర‌హీరోలు ఉండ‌గా విజ‌య్‌కు అభిమానులు ఇంత రేంజ్‌లో ప‌ట్టం కట్టారు.

ఎప్పుడు సాదాసీదాగా ఉండే విజ‌య్ ఇప్పుడు ఇంట్లో త‌న పెంపుడు కుక్క‌ల‌తో ఉండే ఫోటోల‌ను షేర్ చేశారు. షూటింగ్ లేని స‌మ‌యంలో ఎప్పుడూ ఆయ‌న ఇంట్లోనే ఉంటారు. విజ‌య్‌కు కుక్క‌లంటే చాలా ఇష్ట‌మ‌ట‌. అందుకే ఎంతో ఓపిక‌తో వాటిని కేర్ చేస్తూ పెంచుకుంటాన‌ని చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఈయ‌న షేర్ చేసిన ఫోటోల ప‌ట్ల అభిమానులు సూప‌ర్ విజ‌య్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్ ఆగిపోయిన విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here