కోర్టుకెళ్లిన టిక్‌టాక్‌.. ఎక్క‌డంటే

టిక్ టాక్ కోర్టుకు వెళ్లింది. అయితే మ‌న‌దేశంలో కాదు అమెరికాలో. అమెరికాలో అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ టిక్ టాక్‌పై నిషేధం విధించ‌డంపై ఆ సంస్థ న్యాయ‌స్థానం ద‌గ్గ‌ర‌కు వెళ్లింది.

అమెరికాలో టిక్‌టాక్‌పై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. సెప్టెంబ‌రు 15లోపు టిక్‌టాక్ మొత్తం మూసివేసుకోవాల‌ని ఆయ‌న ఇదివ‌ర‌కే హెచ్చ‌రించారు. దీనిపై టిక్‌టాక్ యాజ‌మాన్యం సీరియ‌స్‌గా ఉంది. కావాల‌నే ట్రంప్ త‌మ‌పై ఇలా చేస్తున్నార‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఇందుకోసం న్యాయ‌పోరాటం చేయాల‌ని సిద్ధ‌మైంది. కాగా ఇప్ప‌టికే టిక్‌టాక్‌ను కొనేందుకు రిల‌య‌న్స్‌, ట్విట్ట‌ర్, మైక్రోసాఫ్ట్ సంస్థ‌లు పోటీ ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

ఈ ప‌రిస్థితుల్లో టిక్‌టాక్ త‌న ఉనికిని చాటుకునేందుకు ట్రంప్ పై పోరాటం చేస్తోంది. కాలిఫోర్నియాలోని ఫెడ‌ర‌ల్ కోర్టులో పిటిష‌న్ వేసింది. అధ్య‌క్షుడు ట్రంప్ రాజ‌కీయ కార‌ణాల‌తోనే త‌మ సంస్థ‌ను నిషేధించాల‌ని చూస్తున్నార‌ని పిటిష‌న్‌లో టిక్‌టాక్ యాజ‌మాన్యం పేర్కొంది. అమెరికా, సింగ‌పూర్‌ల‌లో యూజ‌ర్ల‌కు సంబంధించిన స‌మాచారం క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ల మ‌ధ్య సుర‌క్షితంగా ఉంద‌ని తెలిపింది.

మ‌రి టిక్‌టాక్ విష‌యంలో న్యాయ‌స్థానం ఎలా ముందుకెళుతుందో చూడాలి. ఇప్ప‌టికే అధ్య‌క్షుడు దీనిపై నిషేధం విధించ‌గా న్యాయ పోరాటంలో టిక్ టాక్ గెలుస్తుందా అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here