నాగార్జున‌తో పూరి సినిమా..

అక్కినేని నాగార్జున సినిమా అంటే ఆ క్రేజే వేరు. ఇటు యూత్‌తో పాటు ఓల్డేజ్ ఫ్యాన్స్ కూడా నాగార్జున‌కు చాలా ఎక్కువ‌. అందుకే ఆయ‌న వ‌య‌స‌వుతున్నా ఫాలోయింగ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇటు బుల్లితెర‌లో సైతం ఆయ‌న కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు.

తాజాగా ఆయ‌న పూరి జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి ఓ సినిమాను ఓ కే చేశార‌ని టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. అయితే పూరితో నాగార్జున సినిమా చేసి ద‌శాబ్దం దాటిపోయింది. 15 ఏళ్ల క్రితం ఆయ‌న సూప‌ర్ సినిమాతో ఇద్ద‌రి కాంబినేష‌న్‌కి తెర‌ప‌డింది. అప్ప‌టి నుంచి పూరి జ‌గ‌న్నాథ్ నాగార్జున‌లు క‌లిసి ఒక్క సినిమా చేయ‌లేదు. ఇప్పుడు మ‌రోసారి ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తే మాంచి మాట్ హిట్ అవుతుంద‌నడంలో సందేహ‌మే లేదు.

అయితే నాగార్జున ఇప్పుడు వైల్డ్ డాగ్ సినిమా పూర్తి చేయాలి. ఈ సినిమా పూర్త‌వ్వ‌గానే నాగ్ కోసం మ‌రో ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్‌తో సినిమా చేయాలి. ఆ త‌ర్వాత బంగ‌ర్రాజు సినిమా చేస్తార‌ని తెలుస్తోంది. మ‌రి ఇన్ని సినిమాలు క్యూలైన్ పెట్టుకున్న నాగార్జున పూరి జ‌గ‌న్నాథ్‌తో ఎలా చేస్తారని అంతా అనుకుంటున్నారు. ఒక‌వేళ అదే జ‌రిగితే ద‌శాబ్ద‌న్నరం త‌ర్వాత ఈ స్టార్ కాంబినేష‌న్ రిపీట్ అవుతుంది. మ‌రి దీనికి సంబంధించిన పూర్తి స‌మాచారం నాగార్జున్ బ‌ర్త్ డే ఈ నెల 29వ తేదీన బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని ఇండ‌స్ట్రీలో డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. మ‌రి ఈ కాంబినేష‌న్ గురించి వ‌స్తున్న టాక్ నిజ‌మో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here