వివాదంలో మురళీధరన్ బయోపిక్‌..!

శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథ ఆధారంగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘800’ పేరుతో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక మురళీ ధరన్‌గా విజయ్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో హీరోగా నటిస్తోన్న విజయ్‌ సేతుపతిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘#షేమ్‌ఆన్‌ విజయ్‌సేతుపతి’ అంటూ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ ప్రారంభించారు. నెటిజన్లు ఇలా చేయడానికి గల కారణమేంటంటే.. ‘శ్రీలంక ప్రభుత్వం గత కొన్నేళ్లుగా తమ దేశంలోని తమిళులను అణచివేస్తోంది. జాతి ఆధారంగా వివక్ష చూపించే దేశానికి ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్‌ పాత్రలో మీరు నటిస్తారా.? ఇదేనా తమిళ ప్రేక్షకుల పట్ల మీరు చూపే కృతజ్ఞత అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here