వర్షం కారణంగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్..

కరోనా కారణంగా వాయిదా పడ్డ చిత్ర షూటింగ్‌లు ఇప్పుడిప్పుడే కేంద్రం ఇచ్చిన అన్‌లాక్‌ మార్గదర్శకాలను అనుసరించి మళ్లీ మొదలవుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా హైదరాబాద్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో కొన్ని తెలుగు సినిమాలు షూటింగ్‌ జరుపుకుంటన్నాయి. అయితే తాజాగా మంగళవారం నగరంలో కురిసిన భారీ వర్షాలకు మరోసారి చిత్ర షూటింగ్‌లు వాయిదా పడ్డాయి.

మునుపెన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో చిత్రీకరణలో కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రవితేజ, నాని, అఖిల్‌, నాగచైతన్య, సుశాంత్‌తో పాటు ఇతర హీరోల సినిమాలు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం, అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించడంతో నిర్మాణ సంస్థలు తమ సినిమా షూటింగ్‌లను తాత్కాలికంగా బ్రేక్‌ వేశాయి. కరోనా తర్వాత శరవేగంగా షూటింగ్‌ నిర్వహించాలని భావించిన చిత్ర నిర్మాణ సంస్థలకు వరణుడు ఈ విధంగా మరోసారి అడ్డుకట్టవేశాడు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here