హథ్ర‌స్‌లో మ‌రో అత్యాచారం..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అత్యాచారాలు ఆగడం లేదు. ఓ యువ‌తిపై అత్యాచారం, హ‌త్య చేసిన ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే మ‌రో చిన్నారిపై అత్యాచారం చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దీంతో హ‌థ్ర‌స్‌లో వాతావ‌ర‌ణం వేడెక్కింది. పోలీసులు రంగంలోకి దిగారు.

హ‌థ్ర‌స్‌లో పంతొమ్మిదేళ్ల యువ‌తిపై అత్యాచారం చేసిన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో ఈ కేసును రాష్ట్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. ఇక ఈ కేసులో సీబీఐ ద‌ర్యాప్తు వేగంగా జ‌రుగుతోంది. అయితే ఇటీవ‌ల హ‌థ్ర‌స్‌లో పోలీసు బందోబ‌స్తు ఎక్కువైంది. అత్యాచారం జ‌రిగి మృతి చెందిన బాదితురాలి కుటుంబ స‌భ్యుల‌కు పోలీసులు గ‌ట్టి భ‌ద్ర‌త క‌ల్పించారు. 60 మంది పోలీసులు షిఫ్టుల వారీగా డ్యూటీ చేస్తున్నారు. ఇంటి ప‌రిస‌రాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.

ఈ ప‌రిస్థితుల్లో హ‌థ్ర‌స్‌లో మ‌రో అత్యాచారం చేశాడో కామాంధుడు. సాన్సి ప్రాంతంలో ఇది జ‌రిగింది. నాలుగేళ్ల చిన్నారిపై స‌మీప బంధువుల వ్యక్తే ఈ ప‌ని చేశాడు. ఇంటి బ‌య‌ట ఆ చిన్నారి ఆడుకుంటుండ‌గా అత‌ను ఇంటికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వ‌చ్చిన త‌ల్లితండ్రులు దీన్ని గ‌మ‌నించారు. ఆ తర్వాత హాస్పిట‌ల్‌కి తీసుకెళ్లారు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడికి అరెస్టు చేశారు.

నెల రోజుల వ్య‌వ‌ధిలోనే హ‌థ్ర‌స్‌లో ఇలాంటి ఘ‌ట‌న మ‌రొక‌టి వెలుగు చూడ‌టంతో అంతా భయాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here