హైద‌రాబాద్‌కు రిలీఫ్‌.. ఇక ఏపీలో అప్ర‌మ‌త్తం..

భారీ వ‌ర్షాలు తెలుగు రాష్ట్రాల‌ను ముంచెత్తుతున్నాయి. ప్ర‌ధాన న‌గ‌రాలు మొత్తం వ‌ర‌ద‌నీటిలోనే ఉండిపోయాయి. దీంతో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ నివ‌సిస్తున్నారు. అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఇక హైద‌రాబాద్‌లో ప‌రిస్థితి కాస్త మెరుగ‌వుతుంద‌న్న ఆశలు రేకెత్తుతున్నాయి.

హైద‌రాబాద్‌లో నేడు ఓమోస్త‌రు నుంచి భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. రేపు మాత్రం హైద‌రాబాద్‌కు వ‌ర్షం లేద‌ని అంటున్నారు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం ప‌రిస్థితి ఇంకా డేంజ‌ర్‌లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో నాలుగు రోజుల పాటు ఏపీలో వ‌ర్షాలు కురుస్తాయ‌ని అంటున్నారు. తేలిక‌పాటి నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల‌లో నివ‌సిస్తున్న వారు ఓ వైపు హైద‌రాబాద్‌లో వ‌ర్షాలు లేక‌పోవ‌డంతో సంతోషిస్తున్నా.. ఏపీలో కుర‌వ‌బోయే వ‌ర్షాల‌కు ఆందోళ‌న చెందుతున్నారు.

ఇక వారం రోజులుగుగా ఏపీలో వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప‌లుచోట్ల మామూలుగా, ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంక‌లు , ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. ఇక తీవ్ర గాలుల‌కు తీర ప్రాంతం అల్ల‌క‌ల్లోలంగా ఉంది. ప్ర‌జ‌లను సేఫ్టీ ప్లేస్‌ల‌కు త‌ర‌లించేందుకు అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేస్తున్నారు. వర్ష బీభత్సానికి కోస్తాంధ్రలో జనజీవనం స్తంభించిపోయింది.

ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తాండవ రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు తాండవ రిజర్వాయర్ గేట్లను ఎత్తివేశారు. నదీ పరివాహక ప్రాంతాలైన విశాఖ జిల్లా నాతవరం, తూర్పుగోదావరి జిల్లా అల్లిపుడి, కోట నందూరు, కుమ్మరిలోవా గ్రామాల మీదుగా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని గ్రామాల్లో గడ్డలపైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here