కమల్ సినిమాలో విజయ్ సేతుపతి..

జాతీయ ఉత్తమ నటుడు, దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన కమల్ హాసన్ ఇటీవల తన 232వ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేశారు.  ఈ చిత్రం రాజకీయ నేపథ్యంతో సాగే పొలిటికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నటుడు విజయ్ సేతుపతి ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడని సమాచారం. విజయ్ సేతుపతికి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. రాజకీయాల నేపథ్యంలో సాగనున్న చిత్రం కావడంతో..  ప్రస్తుత రాజకీయాలపై ఇందులో ఏమైనా ప్రస్తావిస్తారా.? అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here