ఆ పుకార్లు నమ్మకండి: విజయ్ దేవరకొండ టీం

సినిమాల్లో అవకాశాలు ఇస్తామంటూ మోసాలు చేస్తున్న సంఘటనలు ఇటీవల తరచుగా కనిపిస్తున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ సినిమా కోసం ఆడిషన్లు నిర్వహించుకున్నాం అంటూ ఓ నిర్మాణ సంస్థ ఇలాంటి మోసానికే పాల్పడింది. ఈ విషయమై విజయ దేవరకొండ టీం అధికారికంగా స్పందించింది.

‘కొన్ని నిర్మాణ సంస్థలు విజయ్ దేవరకొండ పేరు ఉపయోగించుకుని తప్పుడు ఆడిషన్స్ నిర్వహిస్తున్నాయి. అలాంటి వారిని నమ్మొద్దు.. విజయ్‌ సినిమా అప్‌డేట్స్‌ అధికారికంగా ప్రకటిస్తాము.

విజయ్‌ సోషల్‌మీడియా ఖాతా ద్వారా వాటిని ధ్రువీకరిస్తారు. మేం సదరు నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోబోతున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి,  ఏదైనా సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు’ అంటూ విజయ్‌ దేవరకొండ బృందం పేర్కొంది.

ఇక తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ ఫైటర్’ అనే చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here