బిగ్ బాస్ తొలి వికెట్ ఔట్… మొదట ఎలిమినేట్ అయ్యేది అతడేనా.?

బిగ్ బాస్ మొదలై నేటితో (ఆదివారం) వారం పూర్తవుతోంది. ఈక్రమంలోనే తొలి వారం ఎలిమినేషన్‌కు గడువు దగ్గర పడింది. హౌజ్‌ నుంచి ఎవరు బయటికి వెళ్తారనేది మరికొన్ని గంటల్లో తేలుతుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కథనాల మేరకు సూర్య కిరణ్‌ ఎలిమినేట్  అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ప్రతీ విషయంలో ఓవర్ గా రియాక్ట్ అవుతుండడం, అనవసరంగా మాట్లాడుతుండడంతో కిరణ్ పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడమే ఆయనకు ఓట్లు తక్కువ పడడానికి కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్  నుంచి ఒకరు బయటకు వెళ్తుండగా… వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో సెలబ్రిటీ బిగ్ బాస్ ఇంట్లోకి రానున్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్న ఆ కొత్త కంటెస్టెంట్ ఎవరన్న దానిపై ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై ఇద్దరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకరు జబర్దస్త్ ఫేమ్  అవినాష్ కాగా..  మరొకరు ‘ఈరోజుల్లో’ చిత్రం ఫేమ్ యువ నటుడు సాయి కుమార్. బిగ్ బాస్  ఇంటి నుంచి బయటికి వెళ్ళేది ఎవరు… లోపలికి వచ్చేది ఎవరో మరి కొన్ని గంటల్లో తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here