క్వారంటైన్ కేంద్రంలో అత్యాచారం..

క్వారంటైన్ సెంట‌ర్లో అత్యాచారాలు ఎక్కువ‌వుతున్నాయి. భ‌యంక‌ర‌మైన కరోనా సోకి జ‌నాలు ఇబ్బందులు ప‌డుతుంటే కామాంధులు మాత్రం రెచ్చిపోతున్నారు. ఇప్ప‌టికే ప‌లు ఘ‌ట‌న‌లు జ‌ర‌గ్గా.. మ‌రికొన్ని వెలుగు చూస్తూనే ఉన్నాయి.

మ‌హారాష్ట్రలోని థానే జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. క్వారంటైన్ సెంట‌ర్‌కు వ‌చ్చిన ఓ చిన్నారికి తోడుగా వ‌చ్చిన ఓ వ్య‌క్తి ఈ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అయితే ఘ‌ట‌న జూన్ నెల‌లో జ‌ర‌గ్గా బాధితురాలు ఆల‌స్యంగా ఫిర్యాదు చేసింది.

మీరారోడ్డు ప్రాంతంలోని క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న చిన్నారిని చూసుకునేందుకు ఓ మ‌హిళ త‌న ప‌దేళ్ల కూతురితో వ‌చ్చింది. అయితే ఫెసిలిటీలోని ఓ గదిలో ఉండగా, వేడినీళ్లు ఇచ్చే సాకుతో గదిలోకి వచ్చిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన ఆమెను చంపేస్తాన‌ని బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ మేర‌కు బాదితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

బాదితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. త‌న‌పై జూన్ తొలి వారంలో మూడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డినట్టు ఆమె తెలిపారు. కాగా అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కుటుంబానికి ఎక్కడ హాని జరుగుతుందోనన్న భయంతో చెప్ప‌లేద‌ని చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here