బన్నీ స్వామి కార్యం.. స్వకార్యం రెండూ పూర్తి చేస్తున్నాడా?

మెగా హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. గంధపు చెట్ల అక్రమ రవాణా నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా తొలి షెడ్యూల్.. కేరళలోని అడవిలో పూర్తయింది. రెండో షెడ్యూల్ ప్రారంభానికి ముందు కరోనా విజృంభించడంతో షూటింగ్ కాస్త వాయిదా పడింది. అయితే తాజాగా షూటింగ్ ని తిరిగి ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఇదిలా ఉంటే తాజా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తెలంగాణలోని ఆదిలాబాద్ లో  పర్యటిస్తున్నారు. అక్కడి కుంటాల జలపాతాన్ని సందర్శించారు. వీటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ నుంచి బన్నీ మహారాష్ట్ర వెళ్లినట్లు తెలుస్తోంది. బన్నీ మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యంలో పర్యటిస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పర్యటనలో బన్నీ ఫ్యామిలీతో పాటు ‘పుష్ప’ టీమ్ కూడా ట్రావెల్ చేస్తున్నారట.

పనిలో పనిగా ‘పుష్ప’ కోసం లొకేషన్స్ వేట సాగిస్తున్నారని తెలుస్తోంది. కుంటాల జలపాతం వద్ద షూటింగ్ చేసుకోవడానికి అనువైన ప్రదేశాలను గుర్తించారట. అలానే తిప్పేశ్వర్ అభయారణ్యంలో కూడా షూటింగ్ కి అనువైన లొకేషన్స్ చూస్తున్నారని తెలుస్తోంది.  ఈ లెక్కన చూస్తుంటే బన్నీ ఒకేసారి స్వామి కార్యం… స్వకార్యం పూర్తి చేస్తున్నట్లనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here