మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమవుతోంది..!

యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ సెన్సేషన్ గా మారాడు విజయ్ దేవరకొండ. ఇక యువతకు నచ్చే కథాంశాలతో సినిమాలు తీసే దర్శకుల్లో మొదటి వరుసలో ఉంటారు దర్శకుడు సుకుమార్. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో  ఓ సినిమా వస్తుందంటేనే..  ఆ బజ్ మామూలుగా ఉండదు. ఇప్పుడీ క్రేజీ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఈ విషయాన్ని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్న కేదార్‌ సెలగం శెట్టి తన పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించాడు. హీరో విజయ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.

కేదార్ సెలగం కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విజయ్… ‘నాలో నటుడు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. నాలోని ప్రేక్షకుడు సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడు. మీ అందరికీ గుర్తుండిపోయే సినిమాను ఇస్తామని గ్యారంటీ ఇస్తున్నాను. సుక్కుగారితో సెట్స్‌లో ఎప్పుడెప్పుడు కలుద్దామా! అని ఎదురుచూస్తున్నాను. హ్యాపీ బర్త్‌ డే కేదార్‌. నువ్వు మంచి స్నేహితుడివి. ఎంతో హార్డ్‌ వర్క్‌ చేస్తావు’ అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

ఈ చిత్రాన్ని 2022లో మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాకు సంబంధించి మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here