క‌రోనాకు మ‌రో మందు.. రెట్టింపు ఫ‌లితం ఇస్తుందంటున్న‌ప‌రిశోధ‌న‌లు

క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌పంచ దేశాలు వ్యాక్సిన్‌ను క‌నిపెడుతూనే ఉన్నాయి. ఎంతో మంది శాస్త్ర‌వేత్త‌లు దీనికి స‌రిపోయే చికిత్స ఏంటో అన్న ప‌రిశోధ‌న‌లు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీలో చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఇప్పుడున్న మందుల కంటే 20 రెట్లు ఎక్కువ‌గా ప‌నిచేసే మందు దొరికింద‌ని తెలుస్తోంది.

ఢిల్లీ ఐఐటీలో కుసుమ స్కూల్ ఆఫ్ బ‌యోలాజిక‌ల్ సైన్స్ చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. వీళ్లేంచెబుతున్నారంటే ఇప్ప‌టికే క‌రోనా చికిత్స‌కు ఉప‌యోగించే 23 ర‌కాల మందుల‌ను ప‌రిక్షీంచారట‌. వీటిలో లోపిన‌మిర్‌, హైడ్రీక్సీక్లోరోక్వైన్ కంటే టైక్లోపానిన్ అనే మందు మెరుగైన ఫ‌లితాలు ఇస్తుంద‌ని తెలుసుకున్నారు. ఇప్పుడు వాడుతున్న మందుల కంటే ఇది ప‌ది నుంచి ఇర‌వై శాతం ఎక్కువ‌గా ప‌నిచేస్తుంద‌ని ప్ర‌యోగాల్లో తేలింద‌ని చెబుతున్నారు.

ఈ టైక్లోపానిన్‌ను బ్యాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ చికిత్స కోసం ఇప్ప‌టి వ‌ర‌కు వాడుతున్నారు. అయితే దీనిపై మ‌రిన్ని ప్ర‌యోగాలు చేయాల‌ని తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న మందుల కంటే ఇది ఎక్కువ రెట్లు ఫ‌లితాలు ఇస్తుంద‌ని తేల‌డంతో దీనిపై ప‌రిశోధ‌న‌లు ఎక్కువ‌గా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని వైద్య బృందం అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తోంది. క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు విజృంభిస్తున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఏ మందు ఎక్కువ‌గా ప్ర‌భావం చూపితే దానిపైనే ఫోక‌స్ పెడితే బాగుంటుంద‌ని ప్ర‌జ‌లు కోర‌కుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here