గ్యాంగ్‌స్ట‌ర్ ఫిరోజ్ అలీ మృతి వెనుక ఏం జ‌రిగింది..

ఇండియాలో గ్యాంగ్‌స్ట‌ర్ల‌కు కొద‌వ లేదు. ప్ర‌ముఖ గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబే ఇటీవ‌ల పోలీసుల చేతుల్లో హ‌త‌మైన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రో గ్యాంగ్‌స్ట‌ర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆయ‌నే ఫిరోజ్ అలీ.

ఎన్నో దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్ట‌ర్ ఫిరోజ్ అలీని ప‌ట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్ర‌య‌త్నాలు చాలానే ఉన్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు ఆయ‌న దొరికాడు. ఫిరోజ్‌ను ముంబై నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ తీసుకెళ్తుండ‌గా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆయ‌న మృతిచెందారు. ఫిరో్జ్ మృతిని పోలీసులు వెల్ల‌డించారు. కారులో వెళ్తుండ‌గా ఎద్దు అడ్డు రావ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు.

ముంబైలోని మురికివాడ‌లోని ఆయ‌న ఇంట్లో నివాసం ఉంటుండ‌గా ఆయ‌న్న అరెస్టు చేశామ‌న్నారు. జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఫిరోజ్ అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా.. న‌లుగురు పోలీసులు గాయ‌ప‌డ్డారు. కాగా ఈ గ్యాంగ్ స్ట‌ర్ మృతిపై కూడా ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఫిరోజ్‌ది రోడ్డు ప్ర‌మాద‌మేనా అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. కాగా పోలీసులు మాత్రం రోడ్డు ప్ర‌మాద‌మే జ‌రిగింద‌న్నారు. ఏదిఏమైనా దోపిడీలు చేసే గ్యాంగ్ స్ట‌ర్లు చ‌నిపోవ‌డంతో ప్ర‌జలు మాత్రం సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here