ఆర్మీ నేపథ్యంలో విజయ్ కొత్త సినిమా..!

అర్జున్ రెడ్డి సినిమాతో యావత్ సినీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. తనదైన ఆటిట్యూడ్,  డైలాగ్ డెలివరీతో యూత్ ను ఆకర్షించాడీ యంగ్ హీరో. ఇదిలా ఉంటే విజయ్ హీరోగా వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో… దర్శకుడు పూరి జగన్నాథ్ తో చేతులు కలిపాడు విజయ్. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో ఫైటర్ అనే సినిమా తెరకెక్కుతోంది.

ఇదిలా ఉంటే ఫైటర్ తర్వాత విజయ్ నటించబోయే సినిమా ఏదనే దానిపై ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.’నిన్ను కోరి’, ‘మజిలీ’లాంటి ఫీల్ గుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న ‘టక్ జగదీశ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న శివ… ఈ సినిమా పూర్తి కాగానే విజయ్ తో కొత్త చిత్రం మొదలు పెట్టానున్నాడు. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు..
ఈ సినిమా ఆర్మీ నేపథ్యంలో ఉంటుందని, అందులో విజయ్ మేజర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో ఒక అందమైన ప్రేమ కథ కూడా ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here