విజ‌య్‌దేవ‌ర‌కొండ కొత్త రికార్డ్‌..

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో కుర్ర‌కారు హృద‌యాల‌ను దోచుకున్నారు విజ‌య్‌.. ఆ సినిమా త‌ర్వాత విజ‌య్ దేవ‌రకొండ‌కు ల‌క్ష‌లాది మంది ఫిదా అయిపోయారు. తాజాగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో ఫైటర్‌ సినిమా తీస్తున్నారు.

విజ‌య్‌దేవ‌రకొండ సోష‌ల్ మీడియాలో రారాజుగా మారుతున్నారు. ఆయ‌న ఫాలోయింగ్ రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో విజ‌య్ ఫాలోయింగి పెరిగిపోయింది. ఇప్పుడు ఆయ‌న్ను కోటి మంది ఫాలో అవుతున్నారు. దక్షిణాది స్టార్స్‌లో ఇన్‌స్టాలో కోటిమంది ఫాలోవర్లను సంపాదించుకున్న మొదటి హీరో విజయ్ దేవ‌ర‌కొండ‌. దీంతో ఆయ‌న అభిమానులు ఇంకా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా విజ‌య కామెంట్ చేస్తూ.. పదిమందికి అయినా, 100 మందికి అయినా, కోటి మందికి అయినా తాను చూపించే ల‌వ్ త‌గ్గ‌ద‌ని తెలిపారు. ఈ కామెంట్ల‌తో అభిమానుల్లో ఇంకా జోష్ పెరిగిపోయింది. ఇలా సినిమాల‌తో పాటు కోట్లాది మంది హృద‌యాల‌ను కూడా విజ‌య్ గెలుచుకుంటున్నార‌ని చ‌ర్చ న‌డుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here