విజయ్ దేవరకొండ కొత్త సినిమా

అర్జున్ రెడ్డి సినిమా హిట్ తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. వచ్చిన ఈ విజయంతో వరుస సినిమాలు తో బిజీ స్టార్ హీరో అయిపోయాడు. ఈ నేపథ్యంలో తెలుగు తమిళ భాషల్లో ఒక సినిమా చేస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆనంద్ శంకర్ అనే తమిళ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
జ్ఞానవేల్ రాజా సమర్పిస్తోన్న ఈ సినిమాకి ‘నోటా’ (NOTA) అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఎన్నికల పరిభాషలో ‘నోటా’ అంటే .. ‘ఈవీఎం’లో సూచించిన అభ్యర్థులనెవరినీ నేను ఎన్నుకోవడం లేదంటూ ఓటర్ తన అభిప్రాయాన్ని తెలియజేయడం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్ గా మెహ్రీన్ నటిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here