శ్రీనువైట్ల రవితేజ సినిమాలో శ్రీనువైట్ల తనయుడు

ప్రముఖ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం డైరెక్టర్ శ్రీనువైట్ల కి సరైన హిట్ లేదు. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కి  ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే టైటిల్ పెట్టారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల మొదలయ్యాయి. ఈ సినిమాలో ఒక కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ను ఎంపిక చేసుకున్నారు. కథ ప్రకారం ఈ సినిమా 80 శాతం షూటింగును అమెరికాలోని వివిధ నగరాల్లో జరుపుకోనుంది. ఈ సినిమాలో రవితేజ తనయుడు ‘మహాధన్’ .. సీనియర్ హీరోయిన్ ‘లయ’ కూతురు ‘శ్లోక’ చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించనున్నారు. అంతేకాకుండా ఈసినిమాలో కమెడియన్ సునీల్ ఓ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here