షాపింగ్ చేస్తున్న హీరోయిన్ కి వింత అనుభవం ఎదురయింది

అల్లరి నరేష్ సుడిగాడు చిత్రంలో హీరోయిన్ గా నటించిన మోనాల్ గజ్జర్ కు ఇటీవల ఓ షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు వింత అనుభవం ఎదురయ్యింది. ఈ క్రమంలో ఓ మనిషి తన కార్ పార్క్ చేసిన చోట వింత చేష్టలు చేస్తూ చిరాకు తెప్పించాడు హీరోయిన్ మోనాల్ గజ్జర్ కు…దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లో అంబావాడీ ప్రాంతంలో తన స్నేహతులతో కలిసి షాపింగ్ కు వెళ్లిన నటి మోనాల్ గజ్జర్ షాపింగ్ మాల్ ముందు కార్ పార్క్ చేసింది.
అయితే షాపింగ్ అనంతరం ఆమె తీరిగి బయటకు వస్తుండగా ఓ వ్యక్తి ఆమె కారు టైరుపై మూత్రం పోయసాగాడు. ఆగ్రహించిన మోనాల్ అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా అతను ఏ మాత్రం ఆలోచించకుండా వెక్కిలి చేష్టలు చేశాడు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఆ ప్రాంతానికి చెందిన వాడేనని అక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నాడని కనుగొన్నారు. హీరోయిన్ మోనాల్ గజ్జర్  కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తుంది…అయితే ఇప్పుడిప్పుడే గుజరాతి సినిమాలు చేయడం కూడా మొదలు పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here