సీఎం చంద్రబాబు కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో కేంద్ర క్యాబినెట్ లో ఉన్న తెలుగుదేశం మంత్రులు రాజీనామా చేయడం జరిగింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు అశోక్గజపతిరాజు సుజనాచౌదరి తమ రాజీనామా పత్రాలను నరేంద్ర మోడీకి సమర్పించారు.ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబుతో తాజా పరిణామాలపై దాదాపు 20 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో ఫోన్‌లో మోదీ చర్చించినట్లు సమాచారం.
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ పోరాటం ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మరోసారి చలనం రాగా, మంత్రుల రాజీనామాలపై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాగానే ప్రధాని నరేంద్ర మోదీ, మిత్రపక్ష సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య తాజా రాజకీయ అంశాల గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కేంద్రంలో ఉన్న తమ మంత్రులను ఎందుకు రాజీనామా చేశారు కూడా చంద్రబాబునాయుడు ప్రధాని మోడీ కి  వివరించినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here