అసలు బాలీవుడ్‌ సపరేట్‌ ఇండస్ట్రీ కాదట..!

ప్రస్తుతం అంతా పాన్‌ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఒక భాషలో తెరకెక్కిన సినిమాను దేశంలోని అన్ని భాషల్లో విడుదల చేయడం ఇప్పుడో ట్రెండ్‌. ఇక ఈ రేసులో విజయ్‌ దేవరకొండ కూడా తాజాగా ఎంటర్‌ అయ్యాడు. పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫైటర్‌ సినిమాను బాలీవుడ్‌లోనూ విడుదల చేయనున్న విషయం తెలిసిందే. పూరీ ఇందుకోసం భారీగానే కసరత్తులు చేస్తున్నాడు. సినిమాలో బాలీవుడ్‌ నటీనటులు ఎక్కువగా ఉండేలా చూస్తున్నాడు. అయితే తొలిసారి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడంపై మీరు ఎలా ఫీలవుతున్నారు? అన్న ప్రశ్నకు విజయ్‌ దేవరకొండ.. కాస్త విభిన్నంగా సమాధానమిచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు.

ఇంతకీ విజయ్‌ ఏమన్నాడంటే.. ‘అసలు బాలీవుడ్ అనేది సపరేట్ కాదు. అది మనలో భాగమే. ‘ఫైటర్’  హిందీలో నా ఆరంభ చిత్రమనుకోవడం లేదు.. అసలు బాలీవుడ్ అనేది ఇండియాలో సపరేట్ పరిశ్రమ అని నేను అనుకోవడం లేదు. ఇండియాలోని పరిశ్రమలన్నీ ఒకటే’ అంటూ పాన్‌ ఇండియా చిత్రాలను సరికొత్తగా నిర్వచించాడీ యంగ్‌ హీరో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here