మోహన్‌బాబు మొదలెట్టేశారు..!

చాలా రోజుల తర్వాత మోహన్‌బాబు పూర్తి స్థాయిలో హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మోహన్‌బాబు మునుపెన్నడూ నటించని పవర్‌ ఫుల్‌ రోల్‌లో కనిపించనున్నారు.

కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడ్డ ఈ సినిమా నిర్మాణాన్ని చిత్ర యూనిట్‌ తాజాగా శుక్రవారం హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసంలో ప్రారంభించారు. ముహుర్తపు షాట్‌కు విరానికా మంచు, ఐరా, అవ్రమ్‌ కెమెరా స్విచ్చాన్ చేయ‌గా, ల‌క్ష్మీ మంచు, విద్యా నిర్వాణ సంయుక్తంగా క్లాప్ నిచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈసినిమాకు మేస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here