ఈ లెటర్స్‌ సంఖ్య తగ్గే రోజు రావాలని కోరుకుంటున్నాను..

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ వారికి ఉచితంగా బస్సులు ఏర్పాట్లు చేసి ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించాడు నటుడు సోనుసూద్‌. సాయం అడగడమే ఆలస్యం తాను ఉన్నానంటూ ముందుకొచ్చిన సోనును అందరూ హీరోగా పొగుడుతున్నారు. ఇంకొందరైతే ఏకంగా ఆపదలో ఆదుకుంటోన్న దేవుడు అంటూ కీర్తిస్తున్నారు. సోనుసూద్‌కు ప్రజల నుంచి వస్తోన్న విన్నపాలు, వారి కష్టాలు తెలుపుతూ రాస్తున్న లేఖలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా తనకు వచ్చిన లెటర్లను ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు సూనుసూద్‌. ఈ ఫొటోతో పాటు.. ‘‘సాయం’ కోసం ఆర్జిస్తూ నాకు రోజూ వస్తోన్న లేఖలివి.. ప్రతి ఒక్కరికి సాయం అందించాలని, వారిని కలుసుకోవాలని అనుకుంటాను. కానీ అది అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. ఈ లెటర్ల సంఖ్య తగ్గే రోజు రావాలని, ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ఇక ఇటీవల దేవీనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన విగ్రహ మండపం దగ్గర సోనుసూద్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here