‘ఇండియన్‌-2’ ఆగిపోనుందా..?

కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యవస్థలో ఉన్న అక్రమాలు, లంచగొండితనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్‌2’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కొంతమేర చిత్రీకరణ కూడా జరుపుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లో క్రేన్ ప్రమాదం జరిగి యూనిట్ సభ్యులు చనిపోవడంతో కొన్ని రోజులు సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. ఈ ఘటనకు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే కారణమంటూ శంకర్ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కమల్‌హాసన్ కలుగజేసుకోవడంతో వివాదం సద్దుమణిగి షూటింగ్ మళ్లీ మొదలైంది. అంతలోనే కరోనా రావడంతో చిత్రీకరణ మళ్లీ ఆగిపోయింది. దీంతో పూర్తిగా ఈ సినిమా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

తాజాగా ఈ సినిమా బడ్జెట్‌ను తగ్గించాలని నిర్మాణ సంస్థ భావిస్తోందంట. శంకర్‌ మాత్రం దీనికి నో చెబుతున్నాడని సమాచారం. దీంతో సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభంపై నిర్మాణ సంస్థ ఊసే ఎత్తడం లేదని సమచారం. ఈ కారణంగా అసహనానికి గురైన శంకర్‌ కొత్త ప్రాజెక్టును ప్రారంభించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. మరి ఇండియన్‌2 ఆగిపోతుందా.? లేదా నిర్మాణ సంస్థ శంకర్‌ను ఒప్పించి మళ్లీ చిత్రీకరణను మొదలు పెడుతుందో చూడాలి. ఏదేమైనా ఈ సినిమా కోసం ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారన్నది మాత్రం వాస్తవం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here