మరో వ్యాపారంలోకి అడుగుపెట్టిన రౌడీ బాయ్‌..!

కెరీర్‌ తొలినాళ్ల నుంచి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ. అర్జున్‌ రెడ్డితో ఎక్కడ లేని క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్‌.. సినిమాల్లో నటిస్తూనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ‘రౌడీ’ వియర్‌ పేరుతో క్లాత్‌ బిజినెస్‌లోకి ప్రవేశించిన విజయ్‌ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు యూత్‌కు రౌడీ వియర్‌ డ్రస్‌లు ఓ బ్రాండ్‌గా మారాయి.

ఇదిలా ఉంటే తాజాగా విజయ్‌ మరో వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్ కు చెందిన ‘వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీలో భాగస్వామిగా చేరి పెట్టుబడులు పెడుతున్నాడు విజయ్. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్స్ – స్కూటర్లను నగరవాసులకు అద్దెకు అందుబాటులో ఉంచుతుంది. శుక్రవారం మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమ్మిట్ లో వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ ప్రతినిధులు, విజయ్ దేవరకొండతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన విజయ్‌ సరికొత్త హెయిర్‌ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఇక విజయ్‌ ప్రస్తుతం పూరిజగన్నాథ్‌ హీరోగా నటిస్తోన్న ‘ఫైటర్‌’ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here