మూడేళ్లప్పుడే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను..!

సమాజంలో మహిళలపై జరుగుతోన్న ఆగడాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేవు. సెలబ్రిటీలు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రతీ మహిళ లైంగిక వేధింపులకు గురికాక తప్పని పరిస్థితి ఉంది ప్రస్తుతం మనమున్న సమాజంలో. ఇప్పుడిప్పుడే చాలా మంది ప్రపంచం ముందుకొచ్చి తమ జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా దంగల్‌ ఫేమ్‌ ఫాతిమా సనా షేక్‌ కూడా తన జీవితంలో ఎదురైన ఓ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫాతిమా.. ‘నేను మూడేళ్ల వయసులో ఉన్నప్పుడే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. లైంగిక వేధింపుల సమస్య చుట్టూ ఒక కళంకం ఉంది. అందుకే మహిళలెవరూ కూడా తమ జీవితాల్లో చోటు చేసుకున్న లైంగిక దాడుల గురించి నోరు తెరవట్లేదు. ప్రస్తుతం ప్రపంచం మారుతోందని నేను ఆశిస్తున్నాను. దీనిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఈ అంశం గురించి భిన్నంగా ఆలోచిస్తారనుకుంటా. వాస్తవానికి నేను కాస్టింగ్‌ కౌచ్‌ను సైతం ఎదుర్కొన్నాను. ఉద్యోగం లభించే ఏకైక మార్గం సెక్స్‌కు అంగీకరించడం మాత్రమే అని చెప్పిన పరిస్థితులున్నాయి’ అంటూ తన జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుందీ బ్యూటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here