నిర్మాతగా మారనున్న మరో హీరో..

ఓ వైపు హీరోలుగా నటిస్తూనే మరోవైపు నిర్మాతలుగా మారుతున్నారు నేటి తరం హీరోలు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల హీరోలు సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో యంగ్‌ హీరో తరుణ్‌ వచ్చాడు. ఒకప్పుడు నువ్వేకావాలి లాంటి యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌తో క్రేజీ హీరోగా మారి లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న తరుణ్‌ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా తాను నిర్మాతగా మారి ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు తరుణ్‌ స్వయంగా తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో తరుణ్‌ మాట్లాడుతూ.. ‘త్వరలోనే మూడు ప్రాజెక్టులను నిర్మించనున్నాను. వీటిలో రెండు వెబ్‌ సిరీస్‌లు కాగా, మరొక చిత్రాన్ని నిర్మించనున్నాను. ఇందులో నేనే హీరోగా నటిస్తున్నాను. త్వరలోనే వీటికి సంబంధించి అధికారికంగా ప్రకటిస్తాము’ అని చెప్పుకొచ్చాడీ హీరో. మరి కథానాయకుడిగా కాస్త తడబాటు పడుతోన్న తరుణ్‌ నిర్మాతగా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here