విజయ్, రష్మికలది స్నేహమేనా..? అంతకుమించా.? 

కొన్ని వార్తలు ఎలా పుట్టుకొస్తాయో…  ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియదు కానీ. వినడానికి మాత్రం ఆసక్తిగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వార్తే ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదే..  హీరోయిన్ రష్మిక మందన, హీరో విజయ్ దేవరకొండ ల మధ్య ఉన్న సాన్నిహిత్యం. వీరిద్దరు కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. గతేడాది విజయ్ దేవరకొండ ఇంటి గృహప్రవేశానికి రష్మిక మందన హాజరైన విషయం తెలిసిందే.

అయితే తాజాగా విజయ్ దేవరకొండ అమ్మగారి 50వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన పార్టీకి నటి రష్మిక మందన హాజరు కావడంతో గాసిప్ రాయుళ్లకు పని పెట్టినట్లయింది. అయితే ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించి, పెద్ద సంఖ్యలో అతిథులను పిలిస్తే పెద్దగా ఇలాంటి వార్తలు వచ్చేవి కాదేమో.? కానీ అత్యంత దగ్గరి  సన్నిహితులు, బంధువులు హాజరైన ఈ వేడుకకు రష్మిక హాజరుకావడంతో ఈ పుకార్లకు బలం చేకూర్చినట్లవుతోంది. మరి నిజంగా వీరిద్దరి మధ్య ఉంది స్నేహ బంధమేనా…  లేదా అంతకు మించిన బంధమో కాలమే నిర్ణయించాలి.

ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విజయ్ బాలీవుడ్ లో  ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక రష్మిక విషయానికొస్తే బన్నీ హీరోగా తెరకెక్కుతున్న పుష్పలో  నటిస్తున్నారు. ఈ సినిమాలో రష్మికది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here