విద్యాబాల‌న్‌కు పిచ్చిప‌ట్టిందా…?

వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ హీరోయిన్ విద్యాబాల‌న్ ఇండియాలోనే పేరు తెచ్చుకున్నారు. అయితే తనను చాలా మంది ఒత్తిడికి గురిచేశార‌ని విద్యా మాట‌ల్లో అర్థ‌మ‌వుతోంది. ఎందుకంటే సిల్క్‌స్మిత్ బ‌యోపిక్‌లో న‌టించే స‌మ‌యంలో ఎన్నో స‌వాళ్లు ఎదుర‌య్యాయ‌ని చెప్పారు విద్యాబాల‌న్‌.

2011 డిసెంబ‌ర్ 2న డ‌ర్టీ పిక్చ‌ర్ సినిమా విడుదలైంది. విద్యాబాల‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో ఇమ్రాన్ హ‌ష్మీ, తుషార్ క‌పూర్, త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మే అయ్యింది. అప్ప‌టికే మంచి గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాల‌న్ డ‌ర్టీ పిక్చ‌ర్ సినిమాను చేయ‌డంతో అప్ప‌ట్లో ర‌చ్చ‌కెక్కారు.

అయితే విద్యాబాల‌న్ అప్ప‌టి అనుభ‌వాలను పంచుకున్నారు. ఈ సినిమా చేయాల‌ని తాను అంగీక‌రించ‌న‌ప్పుడు పిచ్చి ప‌ట్టి ఇలా చేస్తున్నారా అని విద్యాను ప్ర‌శ్నించార‌ట‌. సినిమా చేయ‌డాన్ని ఆపివేయాల‌ని స‌ల‌హాలు ఇచ్చార‌ని విద్యాబాల‌న్ చెప్పారు.  కానీ డైరెక్ట‌ర్ మిలాన్‌, త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన నిర్మాత ఏక్తాల ప్రోత్సాహం, వారి మీదున్న న‌మ్మ‌కంతో సినిమా చేసేందుకు ఒప్పుకున్న‌ట్లు చెప్పారు.

ఈ సినిమా చేసే ముందు త‌న త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడి వారి స‌మ్మ‌తితో సినిమా చేశార‌ని విద్యా చెప్పుకొచ్చారు. అనుకున్న‌ట్లుగానే సినిమా విడుద‌లై ప్ర‌భంజ‌నం సృష్టించింది. రిలీజ్‌కు ముందు ఊహించ‌ని రికార్డులు సినిమా సొంతం చేసుకుంద‌ని విద్యాబాల‌న్ చెప్పారు. త‌న‌కు జాతీయ స్థాయిలో ఉత్త‌మ న‌టి అవార్డు రావడంతో ఈ సినిమాను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేన‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here