బ‌ర్త్‌డే రోజు వెంక‌టేష్ స్పెష‌ల్ గిఫ్ట్‌..

విక్ట‌రీ వెంక‌టేష్ సినిమాలంటే న‌చ్చిన వాళ్లు ఎవ్వ‌రూ ఉండ‌రు. ఇటు చిన్న పిల్ల‌ల నుంచి అటు ఫ్యామిలీస్ వ‌ర‌కు అంద‌రూ ఆయ‌న సినిమాలు చూస్తారు. అందుకే వెంక‌టేష్ ఆల్ ఏజెస్ బెస్ట్ హీరో అనిపించుకుంటున్నారు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం ఎఫ్‌..3, ఎఫ్‌2 మూవీ ఎంత హిట్ అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అందుకే చిత్ర యూనిట్ దీని సీక్వెల్ తీసేందుకు ఎఫ్‌3ని ప్రారంభించింది.

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌, మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్‌ కౌర్‌ హీరో హీరోయిన్లుగా 2019లో బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఎఫ్‌.2. ఈ సినిమా భారీ స‌క్సెస్ అందుకుంది. విక్టరీ వెంకటేశ్‌ పుట్టినరోజు సందర్భంగా.. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానున్న ‘ఎఫ్‌ 3’ గురించి అధికారిక ప్రకటన వెలువడింది. ‘నవ్వుల వ్యాక్సిన్‌తో మీ ముందుకు వచ్చేస్తున్నాం’ అని వెంకీ వాయిస్‌లో… ‘నవ్వుకోవడాకి మీరు కూడా థియేటర్స్‌కు వస్తారుగా’ అని వరుణ్‌తేజ్‌ వాయిస్‌లో డైలాగ్స్‌తో పాటు ఎఫ్‌2 పాపులర్‌ అయిన ‘అంతేగా ..అంతేగా..’ అనే డైలాగ్‌తో ఉన్న కాన్సెప్ట్‌ వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. వెంకీ న్యూ మూవీ గురించి వీడియో రావ‌డంతో అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here