ఈ వారం బిగ్‌బాస్ ఎలిమినేట‌ర్ ఎవ‌రో తెలుసా..

తెలుగులో మంచి టాక్ సంపాదించుకున్న షోల‌లో బిగ్‌బాస్ ఒక‌టి. ప్ర‌స్తుతం బిగ్‌బాస్ 4వ సీజ‌న్ న‌డుస్తోంది. ప్ర‌తి రోజూ బిగ్‌బాస్‌కు మంచి రేటింగ్ వ‌స్తోంది. దీంతో చివ‌రి ద‌శ‌కు చేరుకుంటున్న బిగ్‌బాస్ 4లో ఎలిమినేష‌న్ ఎవ‌ర‌న్న దానిపై ఉత్కంఠ‌త నెల‌కొంది.

ప్ర‌స్తుతం 13వ వారంలో జ‌రుగుతున్న ఈ షోలో ఎలిమినేష‌న్ క‌న్ఫామ్‌గా ఉంటుంది. ఉన్న ఆరు మందిలో ఐదు మందిని నాగార్జున ఫైనల్‌కు పంపడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే అఖిల్‌ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. కాగా శనివారం సోహైల్‌ ఫైనల్‌కు వెళుతున్నట్లు బిగ్‌బాస్‌ అనౌన్స్‌ చేశాడు. ఇక అభిజీత్‌, అరియానా, మోనాల్‌, హారికలలో ముగ్గురు ఫైనల్‌కు చేరుకుంటారు. ఒకరు మాత్రం ఇంటికి రావాల్సి ఉంటుంది. ఆ ఒకరు ఎవరనేది ఆదివారం రాత్రి ఖరారు అవుతుంది. అయితే లీకేలీ రాయుళ్లు మాత్రం ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి ఎవరు ఎలిమినేట్‌ అవుతున్నారనే దానిపై ఓ క్లారిటీ ఇచ్చేశారు. మోనాల్‌ ఈ వారం బయటకు వస్తుందని టాక్‌. నిజానికి మోనాల్‌ ఎప్పుడో బయటకు రావాల్సింది. కానీ.. బిగ్‌బాస్‌ ఆమెను ఏదో రకంగా సేవ్‌ చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ వారం బిగ్‌బాస్‌కు ఆమెకు ఎలిమినేట్‌ చేస్తున్నాడని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here