ర‌జినీకాంత్‌కు ఫ్యాన్స్‌కు మధ్య స‌మ‌స్య ఏంటో తెలుసా..

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి ఎప్పుడూ చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. త్వ‌ర‌లోనే ఆయ‌న రాజ‌కీయ పార్టీ గురించి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించేశారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ర‌జినీకాంత్ విషయంలో కొంచెం అసంతృప్తిగా ఉన్నార‌ని తెలుస్తోంది. కాగా ర‌జినీ మాత్రం ఈ విష‌యంలో అభిమానుల మాట వినేలా క‌నిపించ‌డం లేదు.

రజనీ కాంత్..ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. కానీ తనకు సీఎం అయ్యే ఉద్దేశ్యం అసలేమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం బాధ్యతలను దీర్ఘదృష్టి, చతురత కలిగిన ఓ యువనాయకుడికి కట్టబెట్టాలని కూడా పేర్కొన్నారు. అయితే..రజనీ అభిమానుల మాత్రం ఈ నిర్ణయంతో పూర్తిగా ఏకీభవించినట్టు కనిపించట్లేదు. అందుకే వారు రజనీ మనసు మార్చేందుకు యత్నిస్తారు. సీఎం అభ్యర్థి తానే అనే సంకేతాలను రజినీ కాంత్ పంపాలంటూ వారు కోరుతున్నారు. ఈ విషయంలో రజనీ అభిమానులు కార్యకర్తలు ఆయన్ను ఒప్పించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

ఈ ఏడాది మార్చ్‌లో రజనీ కాంత్..తనకు సీఎం అవ్వాలన్న కోరిక లేదని స్పష్టంగా పేర్కొన్నారు. తాను పార్టీకి నేతృత్వం వ‌హిస్తాన‌ని చెప్పారు. సీఎం ప‌ద‌వి కోసం ఉన్నతచదువులు చదివి, ఆత్మవిశ్వాసం, దూరదృష్టి కలిగిన ఓ యంగస్టర్‌ను మనందరం కలసి ఎంపికచేద్దామ‌న్నారు. సీఎం అయిన వ్యక్తిపై నిర్మాణాత్మక విమర్శలు చేసేందుకు మాత్రమే పార్టీ పరిమితమవుతుంది. సీఎం విధుల్లో కల్పించుకోదని ర‌జినీ చెప్పారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఇప్ప‌టికీ ర‌జినీకాంత్ సీఎం అవ్వాల‌ని కోరుకుంటూనే ఉన్నారు. మ‌రి మ‌రికొద్దిరోజుల్లో ఏమైనా జ‌రుగుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here