వెంకటేష్ – ఎన్టీఆర్ మల్టీ స్టారర్ ? త్రివిక్రమ్ డైరెక్షన్ లో

గురు సినిమా ఇవాళ థియేటర్ లలో విడుదల అవుతున్న సందర్భంగా వెంకటెష్ తనదైన శైలి లో ప్రమోషన్ చేస్తున్నారు. వరసగా ఇంటర్వ్యూ లు ఇస్తున్న ఆయన మల్టీ స్టారర్ సినిమాలని ఎందుకు అంత ఎక్కువగా చేస్తున్నారు అనేది వివరించే ప్రయత్నం చేసారు. మళ్ళీ కొత్త మల్టీ స్టారర్ ఎప్పుడు తీస్తారు అంటే అన్నీ కుదిరితే త్రివిక్రమ్ తో ఉంటుంది అన్నారు ఆయన.ఈ న్యూస్ లీక్ అవ్వడం తో సోషల్ మీడియా లో ఈ మాట గట్టిగా వినిపిస్తోంది. త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తోన్న మల్టీస్టారర్‌ అంటే ఇక దాని రేంజ్‌ ఓ లెవల్లో ఉంటుంది.

టాప్ హీరోలతో మాత్రమే సినిమాలు తీసే త్రివిక్రమ్ వెంకటేష్ ఎన్టీఆర్ తో మల్టీ స్టారర్ తీస్తారు అనే మాట వినపడుతోంది. ప్రస్తుతం పవన్ తో సినిమా ఇంకా మొదలెట్టలేదు, అది అవ్వగానే ఎన్టీఆర్ తో సినిమా ఉంది సో ఎన్టీఆర్ మీదనే అందరి కళ్ళూ పడుతున్నాయి. వెంకటెష్ – ఎన్టీఆర్ తెరమీద కనిపిస్తూ త్రివిక్రమ్ రేంజ్ లో కథ నడిస్తే ఇక సూపరో సూపరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here