హ్యాండ్ ఇచ్చిన బన్నీ .. రిలీజ్ ఎప్పుడో !

వేసవి కాలం లో పెద్ద సినిమాల సందడి ని కాటంరాయుడు మొదలు పెట్టేసాడు. థియేటర్ లలోకి దిగిన రాయుడు , బాహుబలి కంటే ముందు భారీ కలక్షన్ ల సునామీ సృసిస్తాడు అని అనుకున్నారు అందరూ. కానీ సినిమా పేలవంగా నడుస్తోంది. కళ్యాణ్ స్టామినా మీద మొత్తం కలక్షన్లు వస్తున్నాయి తప్ప కొత్తదనం ఏదీ లేదు అంటూ చాలామంది పెదవి విరుస్తున్నారు. బాహుబలి కంటే పెద్ద సినిమా సమ్మర్ లో మరేదీ లేదు కానీ మెగా హీరో అల్లూ అర్జున్ నుంచి దువ్వాడ జగన్నాథం రాబోతోంది అనే టాక్ ఉంది.

ఈ సినిమా కి సంబందించిన కొత్త న్యూస్ ప్రకారం ఈ సినిమా అనుకున్న డేటుకు రావడం దాదాపు అసాధ్యమనే తెలుస్తోంది. ఇందుకు కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. బన్నీ కి ఎదో స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనీ అందుకే షూటింగ్ కి రాలేకపోతున్నాడు అని ప్రచారం జరగుతోంది. అది కూడా కాకుండా వేరే కారణాలు వినపడుతున్నాయి. సినిమాటో గ్రాఫర్ కి పాప పుట్టడం తో షూటింగ్ లో చాలా బ్రేక్ లు పడ్డాయి అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here