ఎవరు ఏమన్నా నాన్న గారి మీద సినిమా తీస్తాను .. బాలయ్య ప్రకటన

హిందూపురం లో తన అభిమానుల సాక్షిగా, హిందూ పురం ప్రజల సాక్షిగా గత నెల బాలయ్య తన తండ్రి బయో పిక్ గురించి మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరవాత దానికి సంబంధించి పెద్ద డిస్కషన్ లు సాగాయి. బాలయ్య ఆయన సినిమాని తీసే దమ్ముందా ? వక్రీకరణ చేస్తారా అంటూ అనేక ప్రశ్నలు ఉదయించాయి. కానీ ఆ విషయాలు అన్నీ బాలయ్య ని కొంచెం కూడా ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడా కనపడ్డం లేదు. ఈ విషయం మీద విజయవాడ లో ఇవాళ మీడియా తో మాట్లాడిన బాలకృష్ణ ఎన్టీఆర్ జీవిత విశేషాలు అన్నీ కన్సిడర్ చేసుకుని వచ్చే ఏడాది ఆ సినిమా ఖచ్చితంగా చేస్తా అనీ బోయపాటి శ్రీను తో కానీ వినాయక్ తో కానీ ఈ సినిమా ఉంటుంది అని ప్రకటించారు.

డైరెక్టర్ ల పేర్లు ఆయన ఓపెన్ గా చెప్పకపోయినా ఆయన మాటల్లో యాక్షన్ డైరెక్టర్ అనే పేరు వాడారు. మొత్తం మీద బాలయ్య విమర్శలు ఎదురుకుంటూ వారి నోరు మూయించే విధంగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తోంది. ఏప్రిల్ 2 న తాను విజయవాడ లోనే ఉంటున్నట్టు తెలిపారు బాలయ్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here