బాహుబలి కి పోటీ ఇస్తున్న రెండు సినిమాలు ఇవే …

బాహుబలి సినిమా ఏప్రిల్ 28 న రాబోతూ ఉంది అంటే అందరూ ఆసక్తిగా ఆ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి మేరు నఘ ధీర చిత్రానికి ఎవరైనా పోటీకి రావాలి అనుకుంటారా ? కానీ ఇద్దరు కుర్ర హీరోలు బాహుబలి దగ్గర లోనే తమ సినిమాలు విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు. వరస విజయాలతో జోష్ మీద ఉన్న హీరో రాజ్ తరుణ్ ,.. ఆడొక రకం , కిట్టు ఉన్నాడు జాగ్రత్త తో పరవాలేదు అనిపిస్తున్నాడు.

అతను కళ్ళు లేని వ్యక్తిగా నటిస్తున్న కొత్త చిత్రం అంధగాడు .. వెలిగొంది శ్రీనివాస్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మే వారం లో విడుదల చెయ్యబోతున్నారు . బాహుబలి కి అతి దగ్గరలో వస్తున్న సినిమా ఇదే .. మరొక హీరో నిఖిల్ సిద్దార్థ్ కూడా బాహుబలి ని ఎదిరించే పనిలో పడ్డాడు. సుదీర్ వర్మ తో రాబోతున్న కేశవ ని మే లో విడుదల చేస్తున్నాడు సిద్దార్థ్. బాహుబలి కి ముందర రావడమే బాగా రిస్క్ అంటే విడుదల తరవాత వచ్చి వీళ్ళిద్దరూ ఎంత రిస్క్ చేస్తారో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here